బిగ్బాస్ తెలుగు 7వ సీజన్ ఆరో వారంలో నయని పావని ఎలిమినేట్ అయ్యారు. హౌస్‍లోకి వచ్చిన వారంలోనే ఆమె బయటికి వెళ్లారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఈ వారమే బిగ్‍బాస్ హౌస్‍లోకి నయని పావని వచ్చారు. అయితే, ఓటింగ్ తక్కువగా రావటంతో తొలి వారమే ఆమె ఎలిమినేట్ అయ్యారు. అయితే నయని పావని ఎలిమినేషన్ అయిన తర్వాత సడెన్‌గా శివాజీ కన్ఫెషన్ రూమ్‌లో కనిపించాడు. శివాజీ మిమ్మల్ని బయటికి తీసుకువెళ్లడం జరుగుతుందని ఆ సమయంలో బిగ్‌బాస్ చెప్పాడు.
దీంతో శివాజీ కూడా బయటికి వచ్చి అక్కడే ఉన్న హౌస్‌మెట్స్‌తో నేను బయటికి వెళ్తున్నాను అని చెప్తాడు. దీంతో కంటెస్టెంట్లు అందరూ శివాజీని వెళ్లొద్దని ఆపే ప్రయత్నం చేశారు. కానీ.. అదే సమయంలో డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఆ వెంటనే శివాజీ బయటికి వెళ్లిపోయాడు. గేట్స్ క్లోజ్ అయిపోయాయి. దీంతో ఆట నుంచి ఆయన బయటకు వచ్చేసినట్లే..! శివాజీ మళ్లీ వచ్చే ఛాన్స్ ఉందా..!
ఐదో వారం కెప్టెన్సీ టాస్క్ లో బాగంగా వైర్స్ కింద నుంచి పాకుతూ వెళ్లే గేమ్‌లో శివాజీ గాయపడ్డాడు . దీని తర్వాత ఆయన పెద్దగా టాస్క్‌లలో పాల్గొనలేదు. భుజం చెయ్యి నొప్పి భరిస్తూనే హౌస్‌లో కొనసాగాడు. బిగ్‌బాస్‌లో ఎవరికైనా ఇలాంటి చిన్న ఇబ్బందికి గురైతే షో యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. గాయంతో ఇబ్బంది పడుతున్న శివాజీకి వైద్యులు సలహా మేరకే ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చి ఉంటారని తెలుస్తోంది. నేడు ఆయనకు వైద్యుల సమక్షంలో ఆయన చేతికి ఎక్స్‌రే వంటివి తీసి చికిత్స అందిస్తారని సమాచారం.