బిగ్ బాస్ షో పెద్ద చెత్త అంటూ అడ్డంగా బుక్కైన హీరో నాగార్జున.

మొదటి వారం నుంచే ఈ షో పై ప్రేక్షకులు అసంతృప్తిగా ఉన్నారు. కంటెస్టెంట్స్ ఎంపిక.. ఆట తీరు ఆడియన్స్ కు నచ్చకపోవడమే.. బిగ్ బాస్ నిర్ణయాలు.. ఎలిమినేషన్ పై కూడా విమర్శలు వెల్లువెత్తా యి. ఇక ఈ షోలో ఎప్పుడు ఏం జరుగుతుంది.. ఎటు వైపు వెళ్తుందో కూడా అర్థం కావడం లేదనేది ప్రధాన వాదన. ముఖ్యంగా ఇనయ ఎలిమినేషన్ అనంతరం బిగ్ బాస్ షోపై మరింత నెగిటివిటి పెరిగింది.

అయితే బిగ్ బాస్ షో అనేది ఇతర లాంగ్వేజ్ లో హిట్టవడంతో తెలుగులో బిగ్ బాస్ రియాల్టీ షో ని తీసుకువచ్చారు. అలా ఆ షో మొదలైన కొత్తలో నుండి ఇప్పటివరకు ఎన్నో వివాదాల్లో ఇరుక్కుంటూ వస్తోంది. ఇక ఒక హౌస్ లో దాదాపు 20 మంది వరకు ఉండి గొడవలు, కొట్లాటలు,ప్రేమలు,ఫ్రెండ్షిప్ లు ఇలా వారి రోజు మొత్తం కొనసాగుతూ ఉంటుంది. ఇక ఈ బిగ్ బాస్ షో ద్వారా కొంతమందికి పేరు వస్తే మరి కొంత మందికి ఉన్న పేరు కూడా పోయింది. చాలామంది ఈ షో ద్వారా నెగటివిటీని ఎదుర్కొని అవకాశాలు లేకుండా కనుమరుగైపోయారు.

ఇక షో స్టార్ట్ అయిన కొత్తలో జూనియర్ ఎన్టీఆర్,నానీలు హోస్ట్ గా చేశారు. కానీ మూడో సీజన్ నుండి ఏడో సీజన్ వరకు అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేశారు. అయితే ఈ షో గురించి ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ.. అది ఒక పెద్ద చెత్త షో అని,దాని గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అని బిగ్ బాస్ గురించి మాట్లాడితే నాకు బూతు** వస్తాయి అని ఒక మనిషి ఏం చేస్తున్నాడు అని చూడడం మళ్లీ దానిపై మాట్లాడడం అదో పెద్ద హింస.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *