సీజన్-7లో ఏమైనా జరగొచ్చని, ఉల్టాపల్టా అని హోస్ట్ నాగార్జున ముందే చెప్పేశారు. అందుకే, మొదటి రోజు నుంచే ఏ విషయాలు లీక్ కాకుండా చూసుకున్నారు. అంచనా వేసిన కంటెస్టెంట్లంతా దాదాపు ‘బిగ్ బాస్’లోకి అడుగుపెట్టేశారు. అయితే, కొందరు మాత్రం ఇంకా రాలేదు. కాదు కాదు.. ‘బిగ్ బాస్’ వారిని బయటకు చూపించలేదు. దీన్ని బట్టి చూస్తుంటే.. వారిని ‘బిగ్ బాస్’ అల్రెడీ ఇంట్లోకి దింపేశాడని, కావాలనే వారిని చూపించడంలేదని ప్రేక్షకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా తమిళ బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. అందులో కమలహాసన్ హోస్ట్ గా డ్యూయల్ రోల్ లో సందడి చేశారు. అయితే ఒక కమలహాసన్ బిగ్ బాస్ షో గురించి చెబుతూ ఉండగా మరో కమలహాసన్ ఇప్పుడు ఇదే ఇల్లు, అంతేమంది కంటెస్టెంట్ లు, అవే ట్విస్ట్ లు అందులో కొత్తదనం ఏముంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. హోస్ట్ కమల్ హాసన్ ఈసారి ఒకటి షో రెండు హౌస్ లు అంటూ చెబుతూ అంచనాలు పెంచేశారు. అంటే ఒకటే షో అయిన వేరువేరు హౌస్ లు ఉండబోతున్నాయని క్లారిటీ ఇచ్చారు.
కంటెస్టెంట్స్ లో కొందరిని ఒక హౌస్ లో మరికొందరిని మరొక హౌస్ లో ఉంచుతూ బిగ్ బాస్ ఒక ఆట ఆడుకుంటున్నారని, అవసరమైనప్పుడు కంటెస్టెంట్ ని అటు ఇటు మారుస్తూ ఉంటారని తెలుస్తుంది. తెలుగులో కూడా ఉల్టా ఫల్టా ఇదే అని జోరుగా ప్రచారం సాగుతుంది. మరి ఇది నిజమా కాదా తెలియాలంటే సెప్టెంబర్ మూడు వరకు వేచి చూడాలి. గత సీజన్ అంతగా సక్సెస్ కాకపోవడంతో ఈసారి బిగ్ బాస్ కొత్తగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాగైనా సరే ప్రేక్షకులను ఆకట్టుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తుంది. మరి ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.