చంద్రబాబు ఏం తప్పు చేశారని 19 రోజులుగా జైలులో నిర్బంధించారని ప్రశ్నించారు. ఎలాంటి విచారణ లేకుండానే నిర్బంధిస్తారా? ఆరోపణల్లో వాస్తవాలేంటో తెలుసుకోరా? అని నిలదీశారు. ఇప్పటివరకు ఆయన ఏం తప్పు చేశారో చెప్పలేకపోయారని.. ఏ ఆధారాలూ చూపించలేకపోయారని భువనేశ్వరి అన్నారు.
అయితే చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని నారా భువనేశ్వరి సందర్శించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు ఏం తప్పు చేశారని 19 రోజులుగా జైలులో నిర్బంధించారని ప్రశ్నించారు.
ఎలాంటి విచారణ లేకుండానే నిర్బంధిస్తారా? ఆరోపణల్లో వాస్తవాలేంటో తెలుసుకోరా? అని నిలదీశారు. ఇప్పటివరకు ఆయన ఏం తప్పు చేశారో చెప్పలేకపోయారని.. ఏ ఆధారాలూ చూపించలేకపోయారని భువనేశ్వరి అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో శిక్షణ పొందిన యువత రూ.లక్షలు సంపాదిస్తున్నారని.. చేయి చేయి కలిపి చంద్రబాబుకు అండగా నిలుద్దామని భువనేశ్వరి టీడీపీ కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు.