లేటు వయసులో నాభి చూపిస్తూ రెచ్చగొట్టిన భూమిక.

భూమిక! ఖుషీ సినిమాతో.. టాలీవుడ్లో ఓ రేంజ్‌లో పాపులర్ అయిన ఈ బ్యూటీ.. చాలా యేళ్ల క్రితమే హీరోయిన్‌గా కనిపించడం మానేశారు. స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయి.. వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఇదిలా ఉంటె భూమిక వయస్సు ఎంత పెరిగిందో అందం అంతకు రెండింతలు పెరిగింది అనే చెప్పాలి.తాజా ఫొటోస్ చూస్తే మీరే చెప్తారు. ఆ అందం , ఆ యవ్వనం నెక్స్ట్ లెవల్ అంతే..!

హీరోయిన్ గా రిటైర్ అయిన భూమిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. భూమిక ఎప్పుడూ వెండి తెరకు దూరంగా లేదు. తన వయసుకు తగ్గ రోల్స్ చేస్తూనే ఉంది. అక్క, వదిన తరహా పాత్రలు చేస్తూ కొన్ని ప్రయోగాత్మక చిత్రాల్లో కూడా నటిస్తుంది. గత ఏడాది భూమిక సీటీ మార్ చిత్రంలో గోపీచంద్ కు అక్క పాత్రలో నటించింది. సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రంలో భూమిక వెంకటేష్ కి జంటగా నటించడం విశేషం.

ఆయన వెంకీ భార్య రోల్ చేశారు. గతంలో వీరిద్దరూ వాసు సినిమాలో నటించారు. కరుణాకర్ తెరకెక్కించిన వాసు మ్యూజికల్ హిట్ గా నిలిచింది. పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు భూమిక బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఇచ్చారు. భూమిక యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఆల్ టైం క్లాసిక్ ఖుషి చిత్రంతో భూమిక పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఒక్కడు, సింహాద్రి చిత్రాలు భూమికని తిరుగులేని హీరోయిన్ గా నిలబెట్టాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *