అన్నం వండటానికి సిద్ధం చేసుకున్న బియ్యంలో ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి మనసులో మీ సంకల్పం చెప్పుకోండి. భగవంతుడికి అర్పించినట్లుగా మీ సమస్యలు తీరాలని కోరుకోండి. బియ్యాన్ని ఒక గుప్పెడు ఒక సంచిలో వేయండి. ఇలా ప్రతిరోజూ చేయండి. ఇలా ప్రతిరోజు చేసిన తర్వాత 15 రోజులకు నెల రోజులకు ఒక మూటలా తయారవుతుంది. ఆ మూటను పేదవారికి గాని కాళ్లు లేని వారికి గాని అనాధలకు గాని ఇచ్చి మీ జీవితంలో ఏ లోటు ఉండకుండా చూడమని మనసులో గట్టిగా అనుకోండి.
ఇలా చేయటం వల్ల మీరు భగవంతుడికి అర్పించిన ఫలితం దక్కుతుంది. ఎందుకంటే ఆత్మ పరమాత్మ అంటారు. పెద్దలు అంటే ప్రతి ఒక్కరి ఆత్మ భగవంతునితో సమానం.. దేహం వేరు ఆత్మ వేరు దేహంలో ఉన్న ఆత్మ భగవత్ స్వరూపం ఆత్మకు ఎటువంటి రూపం లేదు కుంటి వారు పేదవారు ఇలా ఆకలితో అలమటిస్తున్న వారికి మీరు అన్నం వండడానికి ముందుగా బియ్యాని దానం చేస్తే వారిలోని ఆత్మ మనల్ని దీవిస్తుంది. వారు ఆహారం కోసం అలమటిస్తున్న సమయంలో మీరు బియ్యాన్ని అందించడం వల్ల వారిలోని పరమాత్మ సంతోషిస్తాడు.
అలాంటి వారిని గ్రహించుకొని మనకి ఉన్న దాంట్లో ఉన్నంత ఎంతోకొంత దానం చేయాలి. దానం చేసే మనకి వచ్చేటువంటి పుణ్యఫలం అంత ఇంతా కాదు.. ఇలా దానాలు చేసిన వారికి దోష నివారణ జరిగి జీవితంలో సకల శుభాలు ఆనందాలు కలుగుతాయి. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఆడవారు బియ్యం కడిగేటప్పుడు ఈ పరిహారాన్ని కనుక తప్పకుండా చేసినట్టయితే ఈ యొక్క చిన్న పని వల్ల మీరు కోటీశ్వరులు అవ్వటం ఖాయం.. మీరు అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా నెరవేరుతాయి.