మిల్కీ అందాలతో వెండితెరపై గ్లామర్ ట్రీట్ ఇస్తూ వస్తున్న తమన్నాకు భారీ ఫాలోయింగ్ ఉంది. శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ హ్యాపీ డేస్ సినిమాతో కెరీర్‌లో టర్న్ తీసుకుంది. ఆ తర్వాత వరుసపెట్టి స్టార్ హీరోల సినిమాల్లో నటించి పలు బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన ఆడిపాడిన తమన్నా.. తన అందాలతో తమిళ, హిందీ ప్రేక్షకులను కూడా ఆకర్షించింది.
అలా సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న ఈ బ్యూటీ.. ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఇకపోతే సోషల్ మీడియాలో కూడా తమన్నా హవా నడుస్తోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ లుక్స్ తో ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా స్టన్నింగ్స్ ఫొటోస్ షేర్ చేసింది. తన అందంతో కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. ఎద అందాలు హైలైట్ చేస్తూ బ్లాస్టింగ్ లుక్స్ పోస్ట్ చేసింది. దీంతో ఈ పిక్స్ చూసి కుర్రకారు షేక్ అయిపోతున్నారు.
తమన్నా అందాలను పొగిడేస్తూ రెచ్చిపోయి కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ముంబైలోనే సెటిల్ అయిన తమన్నా బాలీవుడ్ లో తమన్నా భాటియా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉంది. ఇటీవలే ప్లాన్ ఏ ప్లాన్ బీ’చిత్రం ద్వారా ఓటీటీలో అలరించింది తమన్నా. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి- మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన భోళా శంకర్ సినిమాలో తళుక్కుమంది తమన్నా. రజనీకాంత్ జైలర్ మూవీతో స్పెషల్ గా అట్రాక్ట్ చేసింది. అదే జోష్ లో కెరీర్ కంటిన్యూ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.