తెలంగాణ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తోంది బర్రెలక్క అలియాస్ శిరీష. దీంతో ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా ఈ యువతి పేరే ఎక్కువగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో బర్రెలక్క పేరు హాట్ టాపిక్ అయింది. ఈమెకు విద్యార్థి సంఘాల నేతలతో పాటు నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మద్ధతు తెలుపుతున్నారు.
ఇన్‌స్టా, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా ఆమె వీడియోలే కనిపిస్తున్నాయి. అయితే శిరీష ఎమ్మెల్యే అయితే మొదట ఆనందపడేది తానే అన్నారు. ఇలాంటివాళ్లు ఎందరికో రోల్ మోడల్ అవుతారన్నారు. చాలామంది పని చేశారు… చాలా పార్టీలు పని చేశాయి. కానీ మనం కొత్త తరానికి అవకాశం ఇవ్వాలన్నారు.
యానాం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాడి కృష్ణారావు ఎల్లుండి ఇక్కడకు వస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో పోల్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యమైన అంశమన్నారు. శిరీష ఈ స్థాయికి రావడానికి కారణం సోషల్ మీడియా అని, కాబట్టి దానిని మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు.