నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి శిరీష స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. నిరుద్యోగుల తరపున పోరాడేందుకు తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించి నామినేషన్ దాఖలు చేశారు. అయితే కొల్లాపుర్ నియెజకవర్గ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్కపై కన్నతండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వీడియోలో ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోలో బర్రెలక్క తండ్రీ మాట్లాడుతూ..
శిరీష అలియాస్ బర్రెలక్కకు అంగరంగ వైభవంగా వివాహం చేశాని తెలిపారు. కానీ భర్త నుంచి ఆమె విడాకులు తీసుకుని తల్లితో ఉంటుందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో తన తండ్రి తాగుబోతు, మమ్మల్ని పట్టించుకోలేదని దుష్ప్రాచారం చేస్తుందని అదేమి నిజం కాదని వెల్లడించారు. కూతురు జీవితం బాగుండాలని ఇంటర్మీడియట్, అగ్రికల్చర్ కోర్స్ చదివించానని ఆయన అన్నారు. కుటుంబానికి అండగా ఉన్నానని, కానీ వాళ్లు లేని నిందలు నాపై మోపి దూరం పెట్టారని వాపోయారు. ఆస్తులు కూడా సంపాధించి పెట్టానని తెలిపారు. డాడీ నేను చదువుకుని నీపేరు నిలబెడతా అంటే..
ఐఏఎస్ అయ్యేంత వరకు చదివిస్తాను దానికోసం వంటల పని, హోటల్ నడిపిస్తాను అని బర్రెలక్కతో చెప్పినట్లు ఆయన చెప్పారు. కానీ బర్కెలక్క మాత్రం బుద్దిగా చదువుకోలేదని తెలిపారు. పదో తరగతి చదివేటప్పుడు అమ్మ తిడుతుంది, అందరు తిడుతున్నరని నిద్ర మాత్రలు మింగిందని తెలిపారు. పదేళ్ల కిందనే మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్లాడని చెప్తుంది. మరి నేను అప్పడు వదిలేసి వెళ్తే వీళ్లను చదివించింది ఎవరు? నేనే చదివించాను కదా అని అన్నారు. రెండు ఇళ్లులు కూడా కట్టించాను అని బర్రెలక్క తండ్రీ తెలిపారు.