తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నిరుద్యోగుల పక్షాణ పోరాటం చేస్తానని హామీ ఇస్తున్నారు. అసలీ బర్రెలక్క ఎవరో తెలుసుకుంద్దాం. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీకాం డిగ్రీ పూర్తి చేసింది.
ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతోంది. అయితే పేపర్ల లీకులు, కోర్టు కేసులు, పరీక్షలు వాయిదా పడడంతో నిరాశ చెందింది. ఈ క్రమంలో ఆమె ఇంటి వద్దు బర్లను కాస్తూ ఓ వీడియో చేసింది. “హాయ్ ఫ్రెండ్స్.. ఎన్ని డిగ్రీలు చేసినా ఉద్యోగం రావడం లేదు. మాయమ్మను అడిగి నాలుగు బర్లు కొన్న.
ఉదయం, సాయంత్రం ఆరు లీటర్ల పాలు ఇస్తాయి” అని వీడియోలో పేర్కొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమె పేరు బర్రెలక్కగా మారిపోయింది. ఆ తర్వాత అధికార పార్టీకి చెందిన వారు తనపై కేసు పెట్టారని బర్రెలక్క చెప్పింది. అయినా భయపడకుండా బర్రెలక్క పోరాటం చేస్తోంది.