“బంటీ నీ సబ్బు నీ సబ్బు స్లోనా ఏంటీ” పాపను ఇప్పుడు చూస్తే మతి పోవాల్సిందే..!

అలా చేతులు కుడుగుతూనే ఉండు..కడుగుతూనే ఉండు అని చెపుతుండగానే అక్కడికి ఒక పాప వస్తుంది. బంటీ నీ సబ్బు స్లో నా ఏంటి అంటూ ఆ పాట లైఫ్ బాయ్ లిక్విడ్ హ్యాండ్ వాష్ తో చేతులు కడుగుతుంది. అప్పట్లో ఈ యాడ్ తో పాటు ఈ పాప కూడా బాగా పాపులర్ అయ్యింది. అయితే ‘బంటి నీ సబ్బు స్లోనా ఏంటీ’ అని ఓ యువతి ఈ లిక్విడ్ హ్యాండ్ వాష్ యాడ్‌లో కనిపించింది. ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది.

ఆ యాడ్‌లో బాబు.. చేతులు కడుక్కోమనే సమయంలో మిగిలిన పిల్లలను ఉద్దేశించి ‘అమ్మా చెప్పింది.. ఒక్కనిమిషం పాటు చేతులు కడుక్కోమని.. లేకపోతే క్రిములు పోవనీ’ అంటూ సబ్బు తీసుకుని తన చేతులతో కడుగుతూనే ఉంటాడు. కడుగుతూనే ఉండు కడుగు అంటుండగానే.. ఓ పాప..అక్కడకు వచ్చి బంటీ నీ సబ్బు స్లోనా ఏంటీ అంటూ కౌంటరేస్తోంది.

ఆ యాడ్ ఎంత ఫేమస్ అయ్యిందో ఆ పాప కూడా. అయితే ఇప్పుడు ఆ పాపను చూస్తే మాత్రం.. నిజంగా గుడ్లు తేలేస్తారు. మెరిసే అందంతో కట్టిపడేస్తుందీ ఈ బేబీ. ఇంతకు ఆమె పేరు ఏంటంటే అవ్ నీత్ కౌర్. ఈ యాడ్స్ తర్వాత పలు ప్రకటనల్లో కనిపించింది. చిన్నప్పుడే డాన్స్ రియాలిటీ షోల్లో పాల్గొన్న ఈ ముదుగుమ్మ..పలు సీరియల్స్‌లో నటించింది. ఎక్కువగా మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది ఈ పంజాబీ బ్యూటీ.

అలాగే హిందీ సినిమాల్లోనూ నటించింది. మర్దానీ సినిమాల్లో మీరా పాత్రలో మెప్పించింది. పంజాబ్‌లోని జలంధర్‌లో పుట్టిన ఆమె..ప్రస్తుతం హీరోయిన్‌గా మారింది. టికు వెడ్స్ షేరు అనే చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *