తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి 90 సీట్లు వస్తాయని జోస్యం చెప్పిన బండ్లన్న.. బండ్ల గణేష్ ఏది చేసినా ఒక సంచలనమే అంటారు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ పై ఎక్కితే ఆయన చేసే వ్యాఖ్యలు కొంతకాలం పాటు వైరల్ అవుతుంటాయి.
నటుడిగా, నిర్మాత, వ్యాపారిగా, రాజకీయ నేతగా బండ్ల గణేష్ గత ఎన్నికల్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజం కావడంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయనకు జేజేలు పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ 2018 లో ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని బల్ల గుద్ది మరీ చెప్పాడు. ఒకవేళ కాంగ్రెస్ గెలవకుంటే తన గొంతు కోసుకుంటా అన్నారు. కానీ ఆయన అంచనాలు తారుమారయ్యాయి.. కాంగ్రెస్ ఓడిపోయింది. దీంతో బండ్ల గణేష్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఊదరగొట్టాయి.
కానీ ఆయన మాత్రం కాంగ్రెస్ వైపు స్టాండ్ తీసుకుంటూ వస్తున్నారు. ఈ మద్య మరోసారి కాంగ్రెస్ విజయం గురించి మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తాం.. డిసెంబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి, కేబినెట్ భేటీ అయ్యి.. ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం చేస్తాం.. కాబోయే కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం కోసం డిసెంబర్ 7న సాయంత్రం నుంచే ఎల్బీ స్టేడియంలో పడుకుంటా.. దుప్పట్లు కూడా తీసుకువెళ్తున్నా’ అని అన్నారు.