తాజాగా మంత్రి రోజా తిరుమల కేంద్రంగా విమర్శలకు కారణమయ్యారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలతో తమ పవర్ నిరూపించుకొనేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న టీటీడీ మంత్రులు వస్తే మాత్రం నో చెప్పలేకపోతోంది.
మంత్రుల డిమాండ్ కు తలొగ్గుతోంది. వారికి కావాల్సినన్ని బ్రేక్ టిక్కెట్లు కేటాయిస్తోంది. అయితే నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాథస్వామి ఆలయంలో వేద పండితులు వారిని ఆశీర్వదించగా, ఆలయ అధికారులు స్వామివారి పట్టు వస్త్రాలతో సత్కరించారు.
అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడారు.