నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. బాలయ్య అభిమానులు కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2017లోనే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తారని బాలకృష్ణ స్వయంగా వెల్లడించారు. అయితే భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ వేదికపై బాలకృష్ణ చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. ఈ సినిమాలో చిచ్చా చిచ్చా అంటూ శ్రీలీల ఇబ్బంది పెట్టింది. అందుకే నెక్స్ట్ మూవీలో హీరో హీరోయిన్ గా చేద్దాం అన్నాను. ఇదే విషయం ఇంట్లో చెబితే… మోక్షజ్ఞ కోప్పడ్డాడు.
నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ. శ్రీలీలతో యంగ్ హీరో నేను నటిస్తాను. నువ్వు ఎలా చేస్తావు అన్నాడంటూ బాలయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో మోక్షజ్ఞ లాంచింగ్ మూవీ హీరోయిన్ ఫిక్స్ అంటూ ప్రచారం జరుగుతుంది. తండ్రి ఎన్టీఆర్ తో నటించిన కారణంగా బాలకృష్ణ శ్రీదేవితో మూవీ చేయలేదు. ఆయన సమకాలీన హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ శ్రీదేవితో జతకట్టారు. అలాగే బాలయ్య పక్కన శ్రీలీల నటిస్తే మోక్షజ్ఞ ఆమెతో నటించడం కుదరదని భవిస్తూ ఉండవచ్చు.
ఎన్నడూ లేని విధంగా భగవంత్ కేసరి మూవీ సెట్స్ కి మోక్షజ్ఞ పలుమార్లు వెళ్ళాడు. తాజాగా కూడా బాలయ్య, శ్రీలీలతో మోక్షజ్ఞ కలిసి కనిపించారు. ఈ క్రమంలో కొత్త ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. శ్రీలీల నందమూరి ఇంటి కోడలు అయ్యే అవకాశాలు కొట్టి పారేయలేం అంటున్నారు. మోక్షజ్ఞ శ్రీలీలను ఇష్టపడుతుండగా, బాలయ్య కూడా శ్రీలీల అంటే సదభిప్రాయం కలిగి ఉన్నాడు. ఆమెను ఒక కుటుంబ సభ్యురాలిగా ట్రీట్ చేస్తున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియాలో శ్రీలీల భవిష్యత్ లో బాలయ్యకు కాబోయే కోడలు అంటున్నారు. మరి చూడాలి ఈ పుకార్లలో ఏ మేరకు నిజం ఉందో…!