దీర్ఘకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు పరిస్థితి విషమంతో ఆయన తుది శ్వాస విడిచాడు . చెన్నైలోని ఆయన వలసరవక్కం నివాసంలో జూనియర్ బాలయ్య మృతి చెందాడు . ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమిళ చిత్ర పరిశ్రమలో లెజెండ్రీ నటుడు, కమెడియన్ అయిన టీఎస్ బాలయ్య కుమారుడు జూనియర్ బాలయ్య (70) తుదిశ్వాస విడిచారు.
దీర్ఘకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు పరిస్థితి విషమించడంతో మరణించారు. చెన్నైలోని ఆయన వలసరవక్కం నివాసంలో జూనియర్ బాలయ్య మృతి చెందారు. ఆయన అసలు పేరు రఘు బాలయ్య. అభిమానులు జూనియర్ బాలయ్య అని పిలుస్తారు. తమిళంలో ఆయన ఎన్నో చిత్రాల్లో నటించారు. 1975లో జూనియర్ బాలయ్య మీనాట్టు మురుమగాళ్ చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. చివరగా ఆయన అజిత్ నేరకొండ పార్వై లాంటి చిత్రాల్లో నటించారు.
తమిళ సినిమాలో జూనియర్ బాలయ్య.. హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. జూనియర్ బాలయ్య నటించిన చిత్రాల్లో వాసలిలే, సుందర కాండం, కుంకీ లాంటి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. జూనియర్ బాలయ్య మృతితో తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. జూనియర్ బాలయ్యకి కుమార్తె నివేదిత సంతానం. గురువారం రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కుటుంబ సభ్యులంతా జూనియర్ బాలయ్య మృతితో తీవ్ర విషాదంలో ఉన్నారు.