పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప పాత్రలో విష్ణు నటిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో భారీ కాస్ట్ ను ఎంపిక చేశారు. మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మంచు విష్ణు హీరోగా తండ్రి మోహన్ బాబు నిర్మిస్తున్న పౌరాణిక సినిమా భక్త కన్నప్ప. న్యూజిలాండ్ లోని అందమైన లొకేషన్ల మధ్య షూటింగ్ జరుపుకుంతొంది.
తాజాగా షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు.. విష్ణు గాయపడినట్లు తెలుస్తోంది. ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో విష్ణుకు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. అదుపు తప్పి ఓ డ్రోన్ కెమెరా విష్ణు మీదకు వెళ్లడంతో ఆయన చేతిని అడ్డుపెట్టగా.. చేతికి బలమైన గాయం అయినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ విష్ణుని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

ప్రస్తుతం సినిమా షూటింగ్ నిలివేసినట్లు సమాచరం. అయితే విష్ణు గాయం గురించి చిత్ర యూనిట్ ఎటువంటి అధికారక ప్రకటన చేయలేదు. ప్రముఖ సినీ ఎనలిస్ట్ రమేశ్ బాల తన ట్విట్టర్ లో భక్తకన్నప్ప సినిమా షూటింగ్ విషయం విష్ణుకు గాయపడిన సందర్భాన్ని వెల్లడిస్తూ ఓ పోస్ట్ చేశారు. అంతేకాదు తన డ్రీమ్ ప్రాజెక్ట్ షూటింగ్ లో ఓ డ్రోన్ కూలడంతో విష్ణుకి గాయాలయ్యాయి.. అయితే ఈ విషయం గురించి చిత్ర నిర్మాతలు ఎటువంటి ప్రకటన చేయలేదంటూ రమేశ్ బాల పోస్ట్ చేశారు. దీంతో మంచు విష్ణు త్వరగా కోలుకోవాలని అని అభిమానులు కోరుకుంటున్నారు.. సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.