తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. రాజకీయంగా, సామాజికంగా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న అన్నగారు ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారని బాలకృష్ణ అన్నారు. బాలయ్యతోపాటు సుహాసిని, రామకృష్ణ కూడా ఎన్టీఆర్‌కి నివాళులు అర్పించారు. అటు.. బాలయ్య కంటే ముందే తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్.. నందమూరి తారకరామారావు ఘాట్‌కి వెళ్లారు.
అయితే టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్దంతి నేడు. ఈ రోజు వేకువ జామున జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ రామ్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. ప్రతీ ఏటా ఎన్టీఆర్ జయంతి, వర్దంతి నాడు తారక్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పిస్తారు. నేడు అదే విధంగా నివాళి అర్పించేందుకు తారక్ వచ్చిన సమయంలో పెద్ద సంఖ్యలో అభిమానులకు అక్కడకు చేరుకున్నారు. తారక్ కు మద్దతుగా నినాదాలు చేసారు.
సీఎం సీఎం అంటూ స్లోగన్స్ ఇచ్చారు. కానీ, తారక్ ఎక్కడా స్పందించలేదు. అప్పటికే ఘాట్ వద్ద భారీ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ కు అనుకూలంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. ఆ తరువాత నందమూరి కుటుంబ సభ్యులతో పాటుగా నందమూరి బాలకృష్ణ తన తండ్రికి నివాళి అర్పించేందుకు అక్కడకు చేరుకున్నారు.