ఈ వేడకను తిలకించేందుకు సెలబ్రెటీలు, ప్రముఖులే గాక దేశం నలుమూలల నుంచి అయోధ్యకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ముందుగా విగ్రహాన్ని కనీసం ఐదు పవిత్ర నదిజలాలతో స్నానం చేయిస్తారు. ఆ తర్వాత నీరు ధాన్యంతో నిమజ్జనం చేస్తారు. దీంతో విగ్రహంలో పవిత్రత వస్తుందని పురాణ వచనం. అయితే జనవరి 16న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం సరయూ నది నుంచి ప్రారంభమై అభిజిత్ ముహూర్తంలో ఆలయ ప్రారంభోత్సవంతో ముగుస్తుంది.
అంతకుముందు రామ్ లల్లా కొత్త విగ్రహం జనవరి 17న ఆలయ సముదాయంలోకి వచ్చింది. ఇక అయోధ్య స్థానికుల కోలాహలంతో కళకళలాడుతోంది. ‘ప్రాణ ప్రతిష్ఠ’, ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. గ్రాండ్ టెంపుల్‌లో రామ్‌లల్లా ‘ప్రాణ్ ప్రతిష్ఠ’ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం నిర్వహించనున్నారు.
ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అన్ని వర్గాల ప్రముఖులు హాజరవుతున్నారు. దేశం నలుమూలల నుండి ఎంపిక చేయబడిన పూజారులచే ఈ వేడుక నిర్వహిస్తున్నారు. లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలో పూజారుల బృందాన్ని ఏర్పాటు చేశారు.