కూతురు మరణం నుంచి కోలుకుంటున్న విజయ్ ఆంటోనీ. మళ్ళీ అప్పుడే..?

కూతురు మరణం నుంచి కోలుకొని మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు. తను నటించిన తాజా మూవీ ‘రత్తం’ రిలీజ్ కి సిద్దమవుతుండడంతో ఆ ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు బయటకి వచ్చాడు. తన చిన్న కూతురు లారాతో కలిసి ఆ మూవీ ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. తాజాగా ఇప్పుడు మరో సినిమాకి సంబంధించిన న్యూస్ ని అనౌన్స్ చేశాడు. అయితే సెప్టెంబర్ 19న విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఈ మరణం సినీ పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. అసలు ఆ అమ్మాయి ఎందుకిలా చేసింది అని చాలామంది సినీ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు.

మీరా వయసు 16 ఏళ్లు మాత్రమే. దీంతో ఈ విషయం విజయ్ ఆంటోనీని ఎంతగా బాధపెడుతుందో.. తన ఫ్యాన్స్ ఊహించగలరు. అయినా కూడా తన సినిమా ‘రత్తం’.. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. కూతురు చనిపోయింది అన్న బాధలో కూర్చొని ఉంటే.. మూవీ ప్రమోషన్స్ ఆగిపోతాయి. మూవీని సరిగా ప్రమోట్ చేయకపోతే.. సినిమాపై, దానికోసం పనిచేసిన టెక్నిషియన్లపై ప్రభావం పడుతుంది. అందుకే ఎంత బాధగా ఉన్నా.. విజయ్ ఆంటోనీ రంగంలోకి దిగారని ఆయన సన్నిహితులు తెలిపారు. విజయ్ ఆంటోనీ తన అప్‌కమింగ్ మూవీ ‘రత్తం’ ప్రమోషన్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టారు.

ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ఫోటోలను నిర్మాత జీ ధనంజయన్ తన ట్విటర్‌లో షేర్ చేశారు. ‘‘ప్రొఫెషనలిజంకు సరైన ఉదాహరణ. నిర్మాతల పట్ల, ఆడియన్స్ పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తారు విజయ్ ఆంటోనీ సార్’’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ‘‘ఆయన మొత్తం ఇండస్ట్రీకి ఒక బెంచ్ మార్క్‌తో పాటు స్ఫూర్తిగా కూడా నిలిచారు. పర్సనల్ ట్రాజెడీని పక్కన పెట్టి మరీ తన టీమ్‌కు సపోర్ట్ చేసే వ్యక్తి. థాంక్యూ సార్’’ అంటూ విజయ్ ఆంటోనీని ప్రశంసించారు ధనంజయన్. నిర్మాత పెట్టిన ఈ పోస్టుకు నెటిజన్లు వివిధ రకాలుగా రియాక్ట్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *