తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తో భేటీ కానున్న పవన్ కళ్యాణ్. చాలా రోజుల తరువాత భేటీ అవ్వడం తో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలనే కీలక నిర్ణయం తీసుకుంది టీడీపీ. అదే సమయంలో బీజేపీతో కలిసి తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతోంది.
ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు భేటి కావడం రెండు ఉభయ రాష్ట్రాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ కు తోడయ్యారు. వాలంటీర్ వ్యవస్థ గురించి పులివెందులలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. వాలంటీర్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉందని ధ్వజమెత్తారు.
వాలంటీర్లు ఒంటరి మహిళ వివరాలను సేకరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను పీడించే ఏ వాలంటీర్ ను కూడా వదిలిపెట్టను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.