ఏప్రిల్ నాటికి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికో పోతాడు, అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుందన్నారు.అమరావతి రాజధానిపై విచారణను సుప్రీంకోర్టు కూడా ఏప్రిల్‌కే వాయిదా వేసిందన్నారు. స్థానిక సుపరిపాలన – ఆత్మ గౌరవం -ఆత్మ విశ్వాసం డిక్లరేషన్‌ను తెలుగుదేశం ప్రకటిస్తోందన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు.
చెత్తపై కూడా సీఎం జగన్ పన్ను వేశారని విమర్శించారు. కరెంట్ ఛార్జీలు విచ్చలవిడిగా పెంచారని మండిపడ్డారు. జయహో బీసీ కోసం 40 రోజుల ప్రణాళిక రూపొందించామని, పేదల ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. జయహో బీసీ లక్ష్యాలను లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో క్షేత్ర స్థాయికి తీసుకెళ్లేలా టీడీపీ ప్రణాళిక ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగితేనే నిజమైన అభివృద్ధి అని చంద్రబాబు చెప్పారు. టీడీపీ హయాంలో బీసీలకు జరిగిన మంచి..
వైసీపీ పాలనలో బీసీలు ఏం కోల్పాయారన్న విషయాలను సదస్సు ద్వారా టీడీపీ తెలియజేస్తోందని తెలిపారు. చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జయహో బీసీ సదస్సు జరిగింది. స్థానిక సంస్థల్లో ఎన్టీఆర్ 20 శాతం రిజర్వేషన్లు తెచ్చారని, తాను వచ్చాక 30 శాతానికి పెంచానని చంద్రబాబు తెలిపారు. లక్ష మంది బీసీ నేతల్ని నాయకులను తీర్చిదిద్దామన్నారు. మూడు రాజధానుల ముచ్చట తీరిపోయిందని, ఇక అమరావతే ఏకైక రాజధాని అని చంద్రబాబు అన్నారు.