ఏసీబీ కోర్టు నుంచి ప్రారంభమైన ఈ పిటిషన్ ప్రస్థానం.. ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఇక్కడ సానుకూలంగా తీర్పు వస్తుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. కేసుల నుంచి బయటపడవచ్చు అని భావిస్తున్నారు. కానీ సుదీర్ఘ వాదనలు, విచారణ వాయిదాలు చూస్తుంటే అనుమానాలు రేకెత్తుతున్నాయి. సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసు లో రిమాండ్ లో ఉండగానే..
మరో కొన్ని కేసులలో ముద్దాయిగా ఉండగా కోర్ట్ లో ఇవి విచారణలో ఉన్నాయి. ఈ కేసులలో ఒకటి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు… కొద్దీ రోజులుగా ఈ కేసులలో చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ఉండడానికి ముందస్తు బెయిల్ కోసం తమ లాయర్లు ఎంతగానో శ్రమిస్తున్నారు, కానీ ఫలితం దక్కలేదు. అయితే ఈ రోజు హై కోర్ట్ లో విచారణలు విన్న న్యాయమూర్తి చంద్రబాబుకు తాత్కాలికంగా ఈ కేసులో ఊరట కలిగేలా తీర్పును ఇచ్చింది.
చంద్రబాబు తరపున లాయర్లు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను విచారించిన కోర్ట్ తాత్కాలికంగా బెయిల్ ను ఇస్తున్నట్లు తీర్పును ఇచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించిన హై కోర్ట్ మళ్ళీ సిఐడి వారికి ఆదేశాలను ఇచ్చే వరకు చంద్రబాబును అరెస్ట్ చేయడానికి వీలు లేదని తెలిపింది. దీనితో ఒక కేసులో చంద్రబాబు కు ఉపశమనం లభించింది. అయితే హై కోర్ట్ ఈ తాత్కలిక బెయిల్ ను ఎన్నో రోజుల వరకు పరిగణలోకి తీసుకుంటుంది అన్నది తెలియాల్సి ఉంది.