చంద్రబాబు పవన్ భేటీలో టీడీపీ-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో పై ప్రధానంగా చర్చించారు. త్వరలోనే ఉమ్మడిగా పది అంశాలతో మ్యానిఫెస్టో విడుదల చేసే అంశంపై మాట్లాడుకున్నారు. త్వరలో జనసేన టీడీపీ ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రెండు పార్టీల మధ్య మరింత ఎక్కువగా సమన్వయం ఉండేలా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
మరోవైపు ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై కూడా క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల్నించి పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి భీమవరంపైనే దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. భీమవరంలో గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ దాదాపు 10 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
ఈసారి పొత్తులో భాగంగా అదే భీమవరం నుంచి పోటీ చేస్తే ఈసారి విజయం పక్కా అనే భావనలో ఉన్నారు. ఇదే విషయంపై చంద్రబాబుతో భేటీ సందర్భంగా చర్చించారని, భీమవరం పవన్‌కు వదిలేసేందుకు చంద్రబాబు సమ్మతించినట్టు సమాచారం.