చికిత్స తర్వాత చంద్రబాబు మళ్లీ జైలుకెళ్లాల్సిందే..! జగన్ ప్లాన్ ఇదే.

గత 53రోజులు రిమాండ్‌ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ చీఫ్‌కు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం విడుదలయ్యారు. ఆయన రాకను స్వాగతిస్తూ అభిమానులు, టీడీపీ శ్రేణులు జైలు ప్రాంగణంలో స్వాగతం పలికేందుకు వచ్చారు. అయితే తొలుత స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు అయ్యారు. ఆ కేసులో ఆయన రిమాండ్ కొనసాగుతూ వస్తోంది. క్వాష్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. అయితే ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టులో ఆ పిటిషన్ డిస్మిస్ అయ్యింది. సుప్రీంకోర్టులో మాత్రం విచారణకు వచ్చింది.

ప్రధానంగా 17 ఏ సెక్షన్ చుట్టూ వాదన కొనసాగింది. చంద్రబాబు అరెస్టు విషయంలో గవర్నర్ అనుమతి తీసుకోలేదన్నఅంశం చుట్టూనే విచారణ సాగింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. నవంబర్ 8న తీర్పు వెల్లడించనున్నట్లు స్పష్టం చేసింది. అయితే చంద్రబాబు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ చంద్రబాబుకు సానుకూల ఫలితం ఇచ్చింది. అయితే మిగతా కేసుల విషయంలో ఈ బెయిల్ వర్తిస్తుందా? లేదా అన్న చర్చ మొదలైంది.

స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు మధ్యంతర లభించినా.. ఇతర కేసులు పెండింగ్ లో ఉండడం చర్చకు కారణమవుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఫైబర్ గ్రిడ్ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇవి ఉండగానే తాజాగా మద్యం కుంభకోణం కేసు తెరపైకి వచ్చింది. ఇందులో చంద్రబాబును a3 గా చూపుతూ సిఐడి కేసు నమోదు చేసింది. ఇదే విషయాన్ని కోర్టుకు నివేదించింది. దీంతో ఈ కేసులో సిఐడి ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేయడానికి ముందుకు వస్తుందా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

అయితే చంద్రబాబు ముందు జాగ్రత్తగా.. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మధ్యాహ్నం దీనిపై విచారణ చేపట్టనున్నారు. అయితే కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి ప్రధాన కారణం చంద్రబాబు అనారోగ్య పరిస్థితులు. చంద్రబాబు కుడి కంటికి ఆపరేషన్ అవసరమని వైద్యులు నిర్ధారించారు. అదే విషయాన్ని చంద్రబాబు న్యాయవాదులు పిటిషన్లో పొందుపరిచారు. అందుకే చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు అయిందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి.

మిగతా కేసులు విషయంలో సైతం ఆయన ఆరోగ్య పరిస్థితులు పరిగణలోకి తీసుకోవడం తప్పదని.. అది అనివార్యమని.. అందుకే హైకోర్టు ఇచ్చిన బెయిల్ విషయంలో అన్ని కేసులకు ఇదే వర్తిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో సిఐడి పట్టు బిగిస్తుందో? లేదో? చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *