కోర్టు ఆదేశాలతో రిమాండ్కు పంపడంతో వైసీపీ మహిళా మంత్రి రోజా సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన తప్పులన్నింటికీ రిటర్న్ గిఫ్ట్ వస్తుందని ఎద్దేవా చేశారు. అయితే జగన్ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పడకేశాయన్నారు.
ఏపీలోని 69 నదులను అనుసంధానం చేయడం ముఖ్యమన్నారు. ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తైతే నీటి సమస్యే ఉండదని తెలిపారు. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి ప్రధాన నదులు, వీటి కింద అనేక నదులు ఉన్నాయన్నారు.
ఉత్తరాంధ్రలో నదులను అనుసంధానం చేసేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు. వంశధార – గోదావరి నదులను అనుసంధానం చేయొచ్చు.. కానీ జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.