టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే చంద్రబాబు క్వాష్ పిటీషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేయగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. అయితే అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరించి ఇవాళ లిస్టింగ్ ఇస్తానని పేర్కొంది. అయితే ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ ఏడాది సెప్టెంబర్ 9న చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై అత్యవసరం గా విచారణ జరిపించాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరుతున్నారు. చంద్రబాబు కంటికి ఆపరేషన్ జరపాల్సిన అవసరం ఉందని ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ లో ఆయన తరపు లాయర్లు కోరారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీని దాఖలు చేశారు.
ఎస్ఎల్‌పీపై ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసులో 17 ఏ చుట్టూ వాదనలు జరిగాయి. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని ఆయన తరపు న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. 17 ఏ చంద్రబాబుకు వర్తించదని ఏపీ సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.ఈ ఏడాది నవంబర్ 8న సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. మరో వైపు ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ నెల 29న సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.