చంద్రబాబు అరెస్ట్ పై నిర్మాత సురేష్ బాబు రియాక్షన్, సినిమా ఇండస్ట్రీ కోసం..!

చంద్రబాబు అరెస్ట్ కు సినీ రంగం నుంచి దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్, మరో నిర్మాత కె.ఎస్.రామారావు స్పందించారు. మోడీ ప్రమేయం లేకుండా, ఆయనకు తెలియకుండా ఎలా అరెస్ట్ జరుగుతుందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మోడీని కోరుతూ రామారావు లేఖను విడుదల చేశారు. అయితే తాజాగా ఈ విషయం గురించి టాలీవుడ్ బడా నిర్మాత సురేష్ బాబుని ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ..

“మా నాన్న రామానాయుడు తెలుగుదేశం పార్టీ మెంబెర్, నేను ఆ పార్టీ కోసం పని చేశాను. కానీ రాజకీయం వేరు, సినిమా వేరు. నన్ను వ్యక్తిగతంగా అడిగితే నేను ఏదైనా సమాధానం చెబుతాను. కానీ నేను ఇక్కడ సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిని. ఇక్కడ నేను ఏది మాట్లాడినా.. అది సినిమా పరిశ్రమ నుంచి అవుతుంది. సినిమా ఇండస్ట్రీ కోసం ఎన్టీఆర్ గారు, చెన్నారెడ్డి గారు కూడా పని చేశారు. చెన్నై నుంచి పరిశ్రమ ఇక్కడికి రావడంలో వీరిద్దరి పాత్ర ఎక్కువ ఉంది. నా వరకు చెన్నారెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ కోసం ఎక్కువ పని చేశారు” అంటూ గుర్తుకు చేశారు.

అలాగే ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన సమయంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతోమంది లీడర్స్ పాలిటిక్స్ లో ఉన్నారని. ఆ సమయంలో వారితో కలిసి నడిచినప్పటికీ ఎప్పుడూ ఎవరూ పొలిటికల్ స్టేట్‌మెంట్స్ ఇవ్వలేదని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయే సమయంలో కూడా ఎవరూ ఎటువైపు సపోర్ట్ చేయలేదని గుర్తు చేశారు. సినిమా ఇండస్ట్రీని నాన్ రిలీజియస్, నాన్ పొలిటికల్ గా చూడండి అంటూ వెల్లడించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *