మామ కోసం రాజమండ్రిలో విజిల్ వేస్తూ మోత మోగించిన నారా బ్రాహ్మణి.

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ మోత మోగిద్దాం పేరిట నిరసన కార్యక్రమానికి నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు ప్యాలెస్‌లో ఉన్న సైకో జగన్‌కు వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు తెలిపే నిరసనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు. అయితే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు రాజమండ్రికి తరలి వచ్చారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రిమాండ్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దీంతో నారావారి కోడలు నారాబ్రాహ్మణి రాజమండ్రిలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు వందలాది మహిళల మధ్యలో నిల్చొని.. చంద్రబాబు అరెస్ట్ ఖండిస్తూ డమరుకం వాయిస్తూ శబ్దం చేశారు. ప్రధానంగా చంద్రబాబునాయుడు అరెస్ట్ రిమైండ్ ను ఖండిస్తూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పడుతున్న బాధలు ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలకు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు స్వీకరించినట్లు తెలిసింది.

దీనికి ప్రధాన లీడర్ గా సైతం నారా బ్రాహ్మణి వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. పాదయాత్ర లేకుంటే బస్సు యాత్ర ఇలాంటి కార్యక్రమాలు సైతం త్వరలో నారా బ్రాహ్మణి చేస్తారని ఒక ప్రచారం కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జోరుగా సాగుతుంది. ఏదేమైనా పార్టీ కష్టంలో ఉన్న నేపథ్యంలో నేనున్నానని మీకేం కాదని అనే విధంగా నారా బ్రాహ్మణి నడుచుకుంటున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *