చంద్రబాబుతో ఈ పూజ చేయించాలని బాలకృష్ణకు ముందే చెప్పా..! వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు.

చంద్రబాబును జైలుకు తరలించినప్పటీ నుంచి.. ఆయన సతీమణి భువనేశ్వరి, కోడల బ్రాహ్మణి, ఇతర కుటుంబ సభ్యులు కొందరు రాజమండ్రిలోనే బస చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నారా భువనేశ్వరి ఈరోజు అన్నవరంలోని సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అన్నవరం ఆలయానికి వెళ్లిన భువనేశ్వరి.. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే జగన్ సీఎం కాకముందు.. 2018 లో నాలుగు సార్లు జగన్ సీఎం కావాలని వేణు స్వామి రాజశ్యామల యాగం చేశారట. వైజాగ్ దగ్గర భీమిలీలో ఈ యాగం చేసినట్టు తెలుస్తోంది.

అయితే.. అదే సమయంలో చంద్రబాబుకు కూడా రాజశ్యామల యాగం చేయించుకోవాలని వేణు స్వామి చాలా సార్లు చెప్పారట. చంద్రబాబు వినరని.. బాలకృష్ణకు వేణు స్వామి చెప్పారట. బాలకృష్ణ చెప్పినా కూడా చంద్రబాబు అస్సలు వినలేదట. 2019 లో ఎలాగైనా రాజశ్యామల యాగం చేయించాలని బాలకృష్ణ పట్టుపట్టారట. చంద్రబాబును అడిగారట. కానీ.. చంద్రబాబు మాత్రం ససేమిరా అన్నారట. ఆ యాగంలో తాను కూర్చోనని చంద్రబాబు అన్నారట. బాలకృష్ణ.. వేణు స్వామిని యాగం చేయడానికి ఒప్పించారు కానీ.. చంద్రబాబును ఒప్పించలేకపోయారట. చంద్రబాబు ఒప్పుకోకపోయినా పర్వాలేదు.. మీరు ఎమ్మెల్యే అవుతారు.. ఒప్పుకోండి.

మీ పార్టీ మాత్రం రూలింగ్ లో ఉండదు అని బాలకృష్ణకు చెప్పా అని వేణు స్వామి చెప్పాడు. దీంతో బాలకృష్ణ ఒప్పుకున్నారని.. అప్పుడు బాలకృష్ణ కోసం చీరాలలో రాజశ్యామల యాగం చేశానని.. అందుకే ఆయన ఎమ్మెల్యే అయ్యారని చెప్పుకొచ్చారు. మరి చంద్రబాబు ఎందుకు ఒప్పుకోలేదు అని యాంకర్ అడిగితే.. ఆయన అంతే.. ఆయన ఎవ్వరినీ నమ్మరు. ఆయనదంతా ఒక లోకం. ఆయన వెరైటీ. ఆయన మెంటాలిటీ వేరు. ఆయన మనం చెప్పకముందే మన గురించి చెప్పేస్తారు. ఆయనంటేనే భయం అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *