నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్, చంద్రబాబు పై పెట్టిన సెక్షన్లు ఇవే.

నంద్యాలలో ఉన్న చంద్రబాబు బస చేసిన క్యాంపు వద్దకు పోలీసులు అర్ద్రరాత్రి తరువాత చేరుకున్నారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున గందరగోళం చోటు చేసుకుంది. తనను అరెస్ట్ చేసేందుకు కారణాలు ఏంటో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. దీంతో అరెస్ట్ కు సంబంధించిన పేపర్లను..వివరాలను అందించిన పోలీసులు చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు.

అయితే నంద్యాలలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. స్కిల్ డెవలప్‍మెంట్ కేసులో AI నిందుతుడి గా ఉన్న చంద్రబాబును అరెస్ట్‌ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు….విజయవాడకు తరలించేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ రోజు ఉదయం 6 గంటలకు చంద్రబాబు అరెస్ట్ చేశారు పోలీసులు.

సిఆర్పిసి సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చారు సిఐడి డిఎస్పీ ధనుంజయుడు. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. అలాగే.. చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, red with 34 and 37 ipc సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. స్కిల్ డెవలప్‍మెంట్ కేసులో A2 నిందుతుడి గా అచ్చెన్నాయుడు ఉన్నారు. ఆయనను కూడా ఇవాళ అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *