ఓ వైపు బాల రాముని ప్రాణ ప్రతిష్ట ఉత్సవం.. మరో వైపు తమ ఇంటికే ఆ బాల రాముడిని తమ బిడ్డల రూపంలో.. సరిగ్గా అదే సమయానికి ఆహ్వానించాలనే తపన. ఇలా కేవలం నిన్న ఒక్కరోజే ఎంతో మంది మాతృ మూర్తులు తహతహలాడరు. చివరికి పట్టుబట్టి సాధించి ప్రసవాలు జరిపించుకున్నారు. అయితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో సోమవారం రాముడి ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. బాల రాముడు విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు.. అయితే ఈ విగ్రహ ప్రతిష్టాత్మ సమయంలో ఓ ముస్లిం గర్భిణి ప్రసవించింది.
పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. అయితే రాముడి విగ్రహ ప్రతిష్టాపన సమయంలో తన భార్య ప్రసవించడం.. పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో..ఆమె భర్త పుట్టిన బిడ్డకు రామ్ రహీం అని పేరు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ ఆసుపత్రిలో సదరు గర్భిణీ ప్రసవం నిమిత్తం ఆస్పత్రిలో చేరింది. సరిగ్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్న సమయంలో ప్రసవించింది. అయితే ఆ బిడ్డకు ఆమె భర్త రామ్ రహీం అని పేరు పెట్టాడు. హిందూ ముస్లింల మధ్య ఐక్యత ఉండటానికి.. మతాలు వేరైనా మనుషుల మంతా ఒక్కటే అని స్ఫూర్తి ప్రదర్శించేలా తన బిడ్డకు ఆ పేరు పెట్టానని ఆ తండ్రి వ్యాఖ్యానించాడు.
రాముడు విగ్రహ ప్రతిష్టాపన సమయంలోనే తనకు మనవడు జన్మించాడని, రెండు మతాలవారు ఐక్యంగా ఉండేలా రామ్ రహీం అని పేరు కూడా పెట్టుకున్నాడని ఆ శిశువు బామ్మ హుస్నా భాను వ్యాఖ్యానించింది.. తన కుమారుడికి పండంటి బాబు జన్మించాడని, అతడికి రామ్ రహీం అని పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొంది. కాగా ఈ విషయం ఆ నోట ఈ నోట పడి మీడియాకు చేరింది. మీడియా కూడా దీనికి సంబంధించి ప్రాప్తంగా వార్తలు ప్రసారం చేయడంతో సోషల్ మీడియాకు కూడా ఎక్కింది. దీంతో ఒక్కసారిగా రాం రహిమ్ అనే పేరు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం న్యూస్ చానల్స్ లో చూసి చాలామంది తన మనవడిని చూడటానికి చూస్తున్నాను హుస్నా భాను మురిసిపోతోంది.