అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వమే దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు చేసింది. జీవితాంతం ప్రజలందరికీ గుర్తిండిపోయేలా చేస్తున్న ఈ వేడుకులకు టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోలు కొందరు హాజరయ్యారు.
చిరంజీవి సతీసమేతంగా అయోధ్యకు ప్రత్యేక విమానంలో వెళ్లారు. వీరితో రామ్ చరణ్ కూడా జాయిన్ అయ్యారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం దక్కడంపై చిరంజీవి స్పందించారు. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ”ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆహ్వానం దక్కడం చాలా సంతోషంగా ఉంది.
నాకు హనుమాన్ అత్యంత ఇష్ట దైవం. ఆయనే స్వయంగా నన్ను ఆహ్వాయించినట్లుగా ఉంది. ఈ ఆనందం మాటల్లో చెప్పలేను. అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన వారిని ప్రోత్సహించకుండా ఉండలేకపోతున్నాను” అని అన్నారు.