బ్రహ్మంగారి పూర్తి పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. 1608 సంవత్సరంలో పోతులూరి పరిపూర్ణాచార్యులు, ప్రకృతాంబ దంపతులకు కాశీ పట్టణంలో వీర బ్రహ్మేంద్రస్వామి జన్మించారు. కొద్ది సంవత్సరాల తరువాత కర్ణాటక స్కంధగిరి పర్వతసానువుల్లో ఉన్న పాపాజ్ఞి మఠం అధిపతులు అయిన వీర భోజయాచార్య, వీర పాపమాంబల వద్ద పెరిగి అక్కడి నుంచి కడప జిల్లాలోని కందిమల్లాయపల్లి చేరుకుని అచ్చమాంబ వద్ద పశువులను కాస్తూ రవ్వలకొండలో కాలజ్ఞానాన్ని రాసారు.
ఇతను సాక్షాత్తూ దైవస్వరూపుడు. చిన్నప్పటి నుంచే ఎన్నో మహిమలు చూపించిన ఆయన భవిష్యత్ ను తమ మనోనేత్రంతో దర్శిస్తూ కాలజ్ఞానాన్ని రచించారు. ఇప్పటివరకు బ్రహ్మంగారు చెప్పినవి అన్ని చాలా వరకు జరిగాయి. భవిష్యత్‌లో మెరెన్నో సంఘటనలు భవిష్యత్‌లో జరుగనున్నాయి. అవి ఏమిటంటే..? ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. ఇందిరాగాంధీ 16 సంవత్సరాలు ప్రధానిగా పని చేశారు.
గట్టి వాడైన పొట్టి వాడు ఒకరు దేశాన్ని పరిపాలిస్తారు. పొట్టిగా ఉన్నది లాల్ బహదూర్ శాస్త్రీ. ఆయన అవినీతి, పక్షపాతానికి లొంగకుండా జనరంజకరంగా దేశాన్ని పరిపాలించారు. తెరమీది బొమ్మలు గద్దెనెక్కుతారు. సినిమా రంగం నుంచి వచ్చిన ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత పరిపాలన కొనసాగించిన విషయం తెలిసిందే.