అయోధ్యలోని రామ్ లలా ఆలయంలో పోయిన ఓ పర్సు..హరిద్వార్‌లో దొరికింది. దాదాపు 680 కిలోమీటర్ల దూరంలో లభ్యమైంది. బాలరాముడి ఆశీస్సుల వల్ల పోయిన పర్సు మళ్లీ దొరికిందని.. ఆ పర్సును పోగొట్టుకున్న కుటుంబం సంబరపడుతోంది. అయితే అయోధ్య బాలరాముడి గుడి.. శతాబ్దాలుగా చెక్కుచెదరని ప్రాచీన భారతీయ దేవాలయాల శైలిలో రూపొందుతున్న కట్టడం.
వెయ్యేళ్లు వర్థిల్లేలా తీవ్రమైన భూకంపాలొచ్చినా తట్టుకుని నిలబడేంతటి పటుత్వమున్న నిర్మాణం.ఇందులో.. ఎన్నో ప్రత్యేకతలు. అందులో ఒకటి సూర్యతిలకం. అయోధ్య రామాలయం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు ప్రసరించేలా జరిగిన ఏర్పాటు పేరే సూర్యతిలకం.
మహాకాళేశ్వర్ మందిరంలో భస్మంతో అభిషేకం చేసినట్టు… బృందావనంలో జన్మాష్టమి రోజున చిన్ని కృష్ణయ్యకు పంచామృతంతో అభిషేకం చేసినట్టు.. అయోధ్యలో బాలరాముడికి సూర్య కిరణాభిషేకం.