అవినాష్ తమ ఇంట జరిగిన తీవ్ర విషాదం గురించి తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించాడు. తమ దంపతులు తమ బిడ్డను కోల్పోయిన విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు. అయితే ఎందుకు ఫ్యాన్స్ కు చెప్పాల్సి వచ్చింది అనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఇన్నాళ్లు తనకు ఆనందం వచ్చినా, బాధ వచ్చిన ప్యాన్స్ తో షేర్ చేసుకున్నానని..
అలాగే ఆ బాధ్యతతోనే ఈ విషయాన్ని కూడా అభిమానులకు తెలియజేయాలి అనుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయంపై తాను ఏమీ మాట్లాడదలుచుకోలేదని.. అలాగే ఎవరూ ఇక ఈ విషయంపై ప్రశ్నలు వేయద్దంటూ రిక్వెస్ట్ చేశాడు. ఆ పోస్టు కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అందరూ ముక్కు అవినాష్- అనూజ దంపతులను తల్చుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఎవరికీ ఎదురుకాకూడని ఒక విషాదం అవినాష్ దంపతులకు ఎదురైందంటూ విచారం వ్యక్తం చేశారు. అలాగే వారు ధైర్యాన్ని కోల్పోవద్దు అంటూ సూచించారు.