మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి ప్రస్తుతం హాలీవుడ్ లో అదరగొడుతోంది. టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కాకుండా ఏకంగా హాలీవుడ్ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అవంతిక వందనపు తాజాగా నటించిన హాలీవుడ్ చిత్రం ‘మీన్ గర్ల్స్’. అయితే అవంతిక వందనపు.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
మన తెలుగు అమ్మాయి ఇప్పుడు హాలీవుడ్ ఓ పాపులర్ సినిమా మిన్ గర్స్‌లో నటించి అదరగొడుతోంది. అంతేకాదు తన రూపం పూర్తిగా మారిపోయింది. దీంతో ప్రస్తుతం ఆమెకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆ అమ్మాయిను చూస్తూ.. అసలు మనం చూస్తున్నది నిజమేనా అని అనిపిస్తుంది. ఇంతలో ఎంత మార్పు అనకుండా ఉండలేం మరి.
అవంతిక 2016లో మహేష్ బాబు హీరోగా వచ్చిన బ్రహ్మోత్సవం సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో తనకు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత వరుసగా ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, అజ్ఞాతవాసి, మనమంతా, వంటి సినిమాల్లో నటించింది. అయితే అన్నింటీలో అవంతిక చేసిన పార్చూన్ అయిల్ యాడ్ చాలా పాపులర్ అయ్యింది.