అషురెడ్డి ఇంట్లో వేణు స్వామి పూజలు, ఆ పూజ దేనికోసమో తెలుసా..?

తాజాగా అషురెడ్డి వేణు స్వామిని సంప్రదించింది. ఆమె కొత్తగా కొన్నకారుకు ఆయన పూజలు చేశారు. రేంజ్ రోవర్ వైట్ కలర్ కారును అషురెడ్డి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ కారుకు వేణు స్వామి పూజలు చేస్తున్నారు. కాగా గత పుట్టిన రోజుకు అషురెడ్డి బెంజ్ కారు కొనుగోలు చేసింది. తన తండ్రి గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్పింది. ఈసారి ఆమె రేంజ్ రోవర్ పై కన్నేశారు.

అయితే గతంలో రష్మిక మందన్నా, డింపుల్‌ హయాతీ, నిధి అగర్వాల్‌లు వేణు స్వామితో ఇంట్లో పూజలు చేయించుకున్నారు. ఇప్పుడీ వరుసలోకి ప్రముఖ నటి అషురెడ్డి చేరిపోయారు. తాజాగా, ఆమె వేణుస్వామితో ఇంట్లో పూజలు చేయించారు. ఆమె పూజలు చేయించిన కారణం కొత్త కారు కొనటం. అవును ఆమె తన కొత్త కారుకు పూజలు చేయించారు. కొద్దిరోజుల క్రితం అషురెడ్డి రేంజ్‌ రోవర్‌ వైట్‌ కారును కొన్నారు. ఆ కారుకు పూజలు చేయించటానికి వేణు స్వామిని ఇంటికి పిలిపించారు. కారుకు పూజలు చేసి వెళ్లిపోయారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గత రెండు, మూడు రోజుల నుంచి సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా, అషురెడ్డి గతంలో బెంజ్‌ కారు కొనుగోలు చేశారు. ఆ కారును తన తండ్రి బర్త్‌డేకు కానుకగా ఇచ్చింది. అప్పట్లో అందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌ అయ్యాయి. మరి, అషురెడ్డి తన కొత్త కారుకు వేణు స్వామితో పూజలు చేయించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *