ఆర్తి అగర్వాల్ మార్ఛి 5వ తేదీన అగర్వాల్ నందినిగా అమెరికాలోని గుజరాతీ కుటుంబంలో జన్మించారు. తండ్రి శశాంక్ వ్యాపారవేత్త, తల్లి వీమా గృహిణి. అమెరికాలో సునీల్ శెట్టి పర్యటించిన సమయంలో ఆర్తీ అగర్వాల్‌ను వేదికపైకి పిలిచి డ్యాన్స్ చేయించడంతో ఆమెలో సినీ తార కావాలనే కోరిక కలిగింది. అందుకు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడంతో ఆమె కల సాకారమైంది. అయితే నిర్మాత చంటి అడ్డాల ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
ఆర్తి అగర్వాల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతను ఆర్తి అగర్వాల్తో కలిసి రెండు సినిమాలు చేశాడు. అల్లరి రాముడు, అడవి రాముడు.. అతను మాట్లాడుతూ.. ఆర్తి అగర్వాల్ మరణించింది అన్న విషయం తెలియగానే చాలా బాధనిపించింది. ఆమె జీవితంలో తండ్రితో చాలా నరకం అనుభవించింది. అతని షూటింగ్ కి వస్తే.. ఏదో ఒకటి చేసేవాడు. ఆమె సరిగ్గా నటించలేకపోయేది. అలాగే ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర నరకం చూపించేవాడు.
తరుణ్ తో పెళ్లి జరగకపోయినా ఆవిడ సినిమాలు నటించుకుంటూ ఉంటే హ్యాపీగా ఉందును. తండ్రి బలవంతంగా ఆమెకు పెళ్లి చేసి.. సినిమాలకు దూరం చేశాడు. దానితో ఆవిడ మానసికంగా క్షీణించిపోయి ఆ పెళ్లి జీవితంలో కూడా సరిగ్గా బ్రతకలేకపోయింది. ఇలా ఆమె చేసిన అనేక మిస్టేక్స్ తో పాటు తండ్రి వలన చాలా టార్చర్ అనుభవించిందని అతను వ్యక్తం చేశాడు. దీంతో అభిమానులు చాలా బాధపడుతున్నారు.