చిత్ర‌ ప‌రిశ్ర‌మ‌లో విషాదం, షూటింగ్‌లో గుండెపోటుతో డైరెక్ట‌ర్ మృతి. షాక్ లో స్టార్ హీరో.

స్టార్ హీరో అజిత్ కుమార్ న‌టిస్తున్న చిత్రం ‘విడా ముయూర్చి’. మగిజ్ తిరుమనేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. త్రిష‌, రెజీనా హీరోయిన్లు కాగా.. సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం అజర్‌బైజాన్‌లో జ‌రుగుతోంది. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్ట‌ర్ గా మిల‌న్ ప‌ని చేస్తున్నారు. ఈ ఉద‌యం ఆయ‌నకు గుండెపోటు వ‌చ్చింది. అయితే తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఆర్ట్ డైరెక్టర్ మిలాన్ గుండెపోటుతో కన్నుమూశాడు. ఇక ఆయన సినిమా సెట్ లోనే మృతి చెందడం మరింత విషాదకరంగా మారింది.

ప్రస్తుతం అజిత్ నటిస్తున్న చిత్రం విడా ముయూర్చి.మగిజ్ తిరుమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష, రెజీనా నటిస్తున్నారు. తెగింపు సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకున్న అజిత్.. ప్రస్తుతం ఈ సినిమాను శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక కొన్నిరోజుల నుంచి ఈ సినిమా షూటింగ్ అజరాబైజన్‌లో జరుగుతోంది. అజిత్ కు అచ్చొచ్చిన ఆర్ట్ డైరెక్టర్ మిలాన్. గతంలో అజిత్ బిల్లా, వేదాళం సినిమాలకు కూడా పనిచేశాడు. ఎప్పటిలానే హుషారుగా సెట్ లోకి వచ్చి వర్క్ చేస్తున్న మిలాన్.. సడెన్ గా అస్వస్థతకు గురయ్యాడు.

ఇక వెంటనే ఆయనను చిత్రబృందం హాస్పిటల్ కు తరలించగా.. అప్పటికే ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కోలీవుడ్ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మిలాన్ మరణం.. అందరిని దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. మిలాన్ మృతితో అజిత్ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇక మిలాన్ మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మిలాన్.. తెలుగులో గోపీచంద్ నటించిన ఆక్సిజన్ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *