‘అర్జున్ రెడ్డి’ బ్యూటీకి చుడండి, జిమ్ చేస్తూ ఎలా మరిపోయిందో చుడండి.

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ కొట్టేసిన షాలినీ పాండే.. తొలి సినిమాతోనే యువత పల్స్ పట్టేసింది. దీంతో ఈ అమ్మడికి నేమ్ ఫేమ్ రెండూ దక్కాయి. అర్జున్ రెడ్డిగా నటించిన విజయ్ దేవరకొండతో ఓవర్ డోస్ రొమాన్స్ చేసి కుర్రకారును ఫిదా చేసింది. అయితే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది షాలిని. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, జిమ్ వర్కవుట్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది.

అయితే ఇటీవల ఓ ఈవెంట్లో పాల్గొంది షాలిని. ఆమెకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. అయితే అందులో షాలిని న్యూలుక్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. ఎప్పుడూ నిండుగా.. ఎంతో అందంగా కనిపించే షాలిని.. ఇప్పుడు మాత్రం బక్కచిక్కిపోయి అసలు గుర్తుపట్టలేని స్థితిలో కనిపించింది. దీంతో నెటిజన్స్ భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.

షాలినికి ఏమైందీ ?.. అసలు నిన్ను ఇలా ఊహించలేము.. ఫిట్ నెస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో కనిపించింది. అలాగే ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం, మహారాజా చిత్రాల్లో నటించింది. అటు హిందీలో మహారాజా సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు షాలిని. ప్రస్తుతం ఈ బ్యూటీ అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది.

తనకు తెలుగు సినిమాలు చేయాలని ఉందని.. ఎందుకంటే తన ఫస్ట్ మూవీ తెలుగు అని.. ఆ చిత్రాన్ని అడియన్స్ ఎంతో ఆదరించారని తెలిపింది. ప్రస్తుతం షాలిని ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *