ఐశ్వర్య అర్జున్ అందమైన ఎరుపు రంగు చీరను ధరించగా.. ఉమాపతి రామయ్య పంచె చొక్కా శల్య ధరించారు. జెన్యూన్ సౌత్ ఇండియన్ కపుల్ గా చాలా క్యూట్ గా కనిపిస్తారు. అయితే అర్జున్ కి ఐశ్వర్య అంజనా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు పేరు ఐశ్వర్య. ఇప్పుడు ఆమె వివాహం ప్రముఖ హీరో ఉమాపతి రామయ్య తో జరిగింది. జూన్ 10 న చెన్నైలోనీ అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో బంధు మిత్రుల మధ్య వైభవంగా జరిగింది.
తమిళ సినీ రంగంలో ఫేమస్ కమెడియన్ అయినటువంటి తంబి రామయ్య కుమారుడే ఉమాపతి. జూన్ 7న హల్ది కార్యక్రమంతో పెళ్లి వేడుకలు ప్రారంభం అయ్యాయి. పెళ్లికి ముందు రోజు సంగీత్ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగింది. రిసెప్షన్ జూన్ 14 న చెన్నయ్ లీలా ప్యాలెస్ లో జరగనుంది. దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన పలువురు సెలబ్రటీస్ ఆ ఫంక్షన్ కి హాజరు కానున్నారు.
ఐశ్వర్య హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో చేసింది. తెలుగు లో కూడా విశ్వక్ సేన్ తో అనుకున్నారు కానీ కుదరలేదు. విశాల్ హీరోగా వచ్చిన పట్టతు ఎన్నై తో తమిళ సినీ రంగ ప్రవేశం చేసింది. 2013 లో ఆ మూవీ రిలీజ్ అయ్యింది.ఇక ఉమా పతి రామయ్య కూడా తమిళ సినీ రంగంలో హీరోగా ప్రత్యేక గుర్తింపుని పొందాడు. అధగ పట్టతు మగజనంగాలై ,మణియార్ కుదుమ్బమ్, తిరుమానం తన్నే వండి లాంటి చిత్రాలు చేసాడు.