ఏపీ రాజకీయాలపై నా నిర్ణయం ఇదే.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ వ్యాఖ్యలు వైరల్.

ఎన్టీఆర్.. రాజకీయాలకు దూరంగా సినిమాలు చేసుకుందామని అనుకుంటున్నప్పటికీ వాటి క్రీనీడ అతనిపై పడుతోంది. భారతీయ జనతాపార్టీ కావచ్చు.. తెలుగుదేశం పార్టీ కావచ్చు.. వైసీపీ కావచ్చు.. తెలంగాణ రాష్ట్ర సమితి కావచ్చు.. పార్టీ ఏదైనా, కార్యక్రమం ఏదైనా దానికి కేంద్ర బిందువుగా జూనియర్ ఎన్టీఆర్ మారుతున్నారు. అయితే నేను మీఅందరికీ చిన్న విన్నపం చేస్తున్నాను. నేను బాధపెట్టాను అని కాదు.

ఒక్కొక్కసారి సినిమాలు చేసేటప్పుడు నిజంగా చెప్పడానికి ఏం ఉండదు. ప్రతి సారి ఏం చెప్పడానికి ఉండదు. మేము ఎలాంటి అప్ డేట్ ఎప్పటికీ ఇవ్వలేం. మీ ఆరాటం నాకు అర్థం అవుతోంది. దాని వల్ల మనం ప్రొడ్యూసర్ల పైన, దర్శకుల పైన ప్రెజర్ ఇవ్వాల్సి వస్తోంది. అభిమానులు అప్ డేట్ కోరుకుంటున్నారు అని ఏది పడితే అది చెప్పలేం. ఇది కేవలం నా ఒక్కరికే కాదు.. చాలామంది ఇదే ప్రెజర్ కు గురవుతున్నారు. దయచేసి ఏదైనా అప్ డేట్ ఉంటే ఇంట్లో ఉన్న భార్య కంటే ముందే మీకు చెబుతాం. నేను నా గురించే కాదు.. నా లాగే ఉండే ఎంతో మంది నటీనటుల గురించి చెబుతున్నా.

అదిరిపోయే అప్ డేట్ ఉంటేనే మీకు చెబుతాం. మీరు ఎక్కడో చదివిన వార్తలను నమ్మకండి.. అంటూ జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఈ రోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడో ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం సినిమాలు తీయాలి. ప్రొడ్యూసర్ల మీద అప్ డేట్ అంటూ ప్రెజర్ పెట్టకండి. త్వరలోనే తన కొత్త మూవీ షూటింగ్ ప్రారంభిస్తాం అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. మీకోసం మీ తల్లిదండ్రులు, మీ భార్య, మీ పిల్లలు ఎదురు చూస్తుంటారు. మాకు మీరు చాలా విలువైన మనుషులు అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *