అనుష్క శెట్టి తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి. బెంగుళూరు నగరానికి చెందిన యోగా శిక్షకురాలు అనూష్క అసలు పేరు స్వీటీ శెట్టి. బెంగుళూరు తన చదువు పూర్తి చేసింది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. అయితే అనుష్క.. తెలుగు, తమిళ్ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె అరుంధతి చిత్రం సినిమాతో ఒక్కసారిగా తన కెరీర్ నే మార్చేసుకుంది. అందులో జేజమ్మగా ప్రేక్షకులను మెప్పించి మరింతగా ఆకట్టుకుంది.
అంతే కాదు బాహుబలి, భాగమతి వంటి చిత్రాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచిన అనుష్క సైజ్ జీరో చిత్రంతో ఒక్కసారిగా తన నట జీవితాన్ని తలకిందులు చేసిందని చెప్పాలి. అనుష్క ఆ పాత్ర కోసం తన బరువును భారీగా పెంచేసుకుంది. ఆ తర్వాత బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం లభించడం లేదు. దీంతో కొన్ని సినిమాలు ఆమె చేయలేక పోయింది. మళ్లీ నిశ్శబ్దం అనే సినిమాతో వచ్చినా సరే అది డిజాస్టర్ గానే మిగిలింది. ఇప్పుడు తాజాగా అనుష్క , నవీన్ పోలిశెట్టి కీలక పాత్రల్లో వస్తున్న “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి “ఆగస్టు 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే అనుష్కకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. గతంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తమ కుమారుడిని పెళ్లి చేసుకుంటారని డైరెక్టుగా అనుష్కను అడిగారట. అయితే అనుష్క మాత్రం రాఘవేంద్రరావు ప్రపోజల్ ని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. గతంలో తన కుమారుడు ప్రకాష్ కి పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు రాఘవేంద్రరావు ఫస్ట్ ఛాయిస్ అనుష్కని అనుకున్నారని.. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పగా ఆమె తిరస్కరించిందని సమాచారం. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు అనుష్క ఒంటరిగానే మిగిలిపోయింది.