కొంత మంది అంతే.. అందం, అభినయం ఉన్న కొంత మందికి లక్ కలిసి రాదు. అలాంటి భామల్లో అను ఇమ్మాన్యుయేల్ ఒకరు. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి హీరోల సరసన నటించిన రావాల్సిన బ్రేక్ మాత్రం రాలేదు ఈ భామకు. అయితే చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అను ఇమ్మానుయేల్. తరువాత ఈ మలయాళ బ్యూటీ నిఫిన్ బాలికి జంటగా యాక్షన్ హీరో బిజూ అనే మలయాళ చిత్రం 2016 లో నటించి హీరోయిన్ గా పరిచయమయ్యింది.
ఇక అదే ఏడాది ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నాని హీరోగా చేసిన మజ్ను తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఇక ఆ తరువాత మరో కోలివుడ్ సినిమాలో శివకార్తికేయన్ కు జంటగా నటించింది. వీరు జంటగా నటించిన ‘నమ్మవీట్టు పిళ్లై’ మంచి టాక్ తెచ్చుకుంది. అయితే దీంతో తన కెరీర్ మలుపు తిరుగుతుందని ఆశించిన ఈ మలయాళీ ముద్దుగుమ్మకు నిరాశే ఎదురయ్యింది. దాంతో ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ పై ఇంట్రస్ట్ పెట్టింది.
ఇక్కడ ఆమెకు పెద్ద హీరోలతో నటించే అవకాశమే దక్కింది. అజ్ఞాతవాసి లో పపన్ కళ్యాణ్ సరసన, నా పేరు సూర్య మూవీలో బన్నీతో జత కట్టింది ఈ బ్యూటీ. ఇక గీత గోవిందంలో కూడా ఓ చిన్న పాత్రను చేసింది. ఇక రీసెంట్ గా అల్లు శిరీష్ తో ఊర్వశివో రాక్షసివో సినిమాలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే టాలీవుడ్ లో కూడా అను కు అనుకున్నంత సక్సెస్ దొరకలేదు. ఇప్పటకీ కూడా టాప్ హీరోయిన్ కాలేకపోయింది.