అన్నపూర్ణమ్మ కూతురు ఆత్మహత్య చేసుకోడానికి కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.

సహజ నటిగా తల్లి పాత్రతో తెలుగు జనాలకు ఎంతో దగ్గరైన అన్నపూర్ణమ్మ 1970లోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.సంసారం ఓక చదరంగం, ముత్యమంత ముద్దు, స్వర్గం నరకం, అసెంబ్లీ రౌడీ వంటి సినిమాల్లో ఆమె నటనతో జనాలకు అలా గుర్తిండిపోయారు. మెగాస్టార్ కు తల్లిగా కూడా ఆమె చాలా సినిమాల్లో నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. అయితే అంతా బాగావుందనుకున్న సమయంలో ఓ రోజు ఉదయాన్నే ఫ్యాన్ కు ఉరి వేసుకొని వ్రేలాడుతూ కనిపించడం షాక్ కు గురి చేసిందని చెప్పారు.

ఇదే సమయంలో తన కూతురు మరణానికి గల కారణంపై కూడా ఆమె ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. అన్నపూర్ణమ్మ వ్యక్తిగత జీవితంలో ఒక విషాదాన్ని అనుభవించారు. ఆమె దత్త పుత్రికను ఎంతో ఆప్యాయంగా పెంచుకొని ఘనంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపారు. ఇవ్వాల్సిన కట్న కానుకలు, ఫ్లాట్, డబ్బు, నగలు వంటి అన్నీ లాంఛనాలు ఇచ్చారు. కానీ పెళ్ళైన కొనాళ్ళకే అనంతలోకాలకి వెళ్ళిపోయారు. మనవరాలు పుట్టిన కొన్నాళ్లకు కూతురు ప్రాణాలు కోల్పోయింది. బెడ్ రూమ్ లో ఆత్మహత్య చేసుకున్న వార్త అప్పట్లో అన్నీ మీడియాలలో వైరల్ అయ్యింది. అయితే అసలు కారణం ఏమిటనేది ఎవరు వెల్లడించలేకపోయారు.

ఇటీవల ఇంటర్వ్యూలో అన్నపూర్ణమ్మ బయటపెట్టారు. చిన్నప్పటి నుంచి తను చెప్పిన కొన్ని విషయాలు నేను పెద్దగా పట్టించుకోలేదు. అయితే అత్తింటి వాళ్ళ మీద ఎప్పుడు కంప్లైంట్స్ ఇచ్చింది లేదు. ఏదైనా సమస్య ఉన్నా నాకు చెబితే మాట్లాడి ఉండేదాన్నేమో. కానీ ఎప్పుడు ఇబ్బందులు లేవని చెప్పుకొచ్చింది. అంతా హ్యాపిగా ఉందనుకున్నాను. నా దగ్గర్నుంచి సంతోషంగా వెళ్ళింది. మరునాడు వాళ్ళ బెడ్‌రూంలో సీలింగ్ ఫ్యాన్‌కి వేళాడుతూ కనిపించింది. బహుషా తను లోలోపల బాధపడి ఉండోచ్చు. తనకి కోపం కాస్త ఎక్కువే. ఆ కారణంగానే తొందరపడి ఇలా చేసి ఉండోచ్చునని తెలిపారు అన్నపూర్ణమ్మ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *