తాజాగా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కూడా హోం శాఖలో సంచలన మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె చేసిన ఒక ప్రకటన ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి షాక్ అనే చెప్పాలి. అయితేహోమ్, విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా వంగలపూడి అనిత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ రెండవ బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో సంతకాలు చేసి బాధ్యతలు తీసుకున్నారు.
బాధ్యతల స్వీకరణకు ముందు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా బాధ్యతలు స్వకీరించిన హోంమంత్రికి రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రజలు దయ వల్ల, చంద్రబాబు ఆశీస్సులతో హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టానని అన్నారు. ఒక సామాన్య టీచర్ అయిన తనను హోం మంత్రిగా చేసిన పాయకరావు పేట ప్రజలందరికీ ధన్యవాదాలు అని అన్నారు. తనపై పెట్టిన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆమె పునరుద్ఘాటించారు.