‘యుగానికి ఒక్కడు’సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న ఆండ్రియా ఆ తర్వాత హీరో సిద్ధార్థ్‌తో కలిసి ‘గృహం’ సినిమాలో హాట్ హాట్‌గా కనిపించింది. బోల్డ్ సీన్లతో మతి పోగొట్టింది. ఆ తర్వాత తెలుగులో నేరుగా ‘తడాఖా’లో నటించింది. అయితే ఆమె అసలు పేరు ఆండ్రియా జెర్మియా చెన్నై లోని అరక్కోణం లో ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో జన్మించింది. ఆమె నుంగంబాక్కం లో మహిళా క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంది. ఆండ్రియా తన పదేళ్ల నుంచి యంగ్ ఇసాదర్సు అనే బృందంలో పాటలు పాడుతుంది.
ఆమెకు పియానో వాయించడం బాగా వచ్చు. పైగా ఆమె న్యాయవాదిగా కూడా పనిచేస్తుంది. 2005 లో కందా నాల్ ముదల్ అనే సినిమాలో అతిథి పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసింది యుగానికి ఒక్కడు, విశ్వరూపం లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ తఢాకా సినిమాతో నేరుగా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఇటీవల సూపర్ హిట్ అయిన పుష్ప సినిమాలో “ఊ అంటావా” పాటను తమిళ్ వెర్షన్ పాడి మంచి పేరు తెచ్చుకుంది. అదే సమయంలో ఈ 36 ఏళ్ల సుందరి అనేక వివాదాల్లో కూడా చిక్కుకుంటుంది.
వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అనల్ మేల్ ఫణితులి అనే సినిమాలో ఆండ్రియా అర్ద నగ్నంగా నటించిందని తెలుస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఇదే ప్రశ్న అడగటంతో అవును నిజమే సినిమాలో ఆ సన్నివేశంలో నటిస్తున్న సమయంలో చాలా బిడియంగా అనిపించింది. కానీ నా లైఫ్ లో అంతకు మించిన సంఘటనలు జరిగాయి అంటూ చెప్పుకొచ్చింది. దీనితో ఆ వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.