యాంకర్ వర్షిణి ఎవరితో ప్రేమలో ఉందో తెలుసా ..? ఆ గుట్టు ఎలా తెలిసిందంటే..?

పలు సినిమాల్లో నటించినప్పటికీ… వర్షిణికి అంతగా గుర్తింపు దక్కలేదు. దీంతో సినిమా అవకాశాలు కూడా సన్నిగిల్లాయి. అలాంటి సమయంలో ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్ ఆమె కెరీర్‌ను మార్చేసింది. సూపర్ సక్సెస్ అయిన ఈ సిరీస్ వల్లే వర్షిణి బాగా పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘ఢీ’తో టెలివిజన్ రంగంలోకి అడుగెట్టింది.

అయితే మీరు అంతా అనుకుంటున్నట్టుగా ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. అవన్నీ తప్పుడు వార్తలు.. ఈ ఫేక్ వార్తలు క్రియేట్ చేసే వారి ఆనందానికి నేను రియాక్ట్ అవ్వాలని అనుకోవడం లేదు కానీ.. ఇలా అందరూ అడుగుతున్నారని క్లారిటీ ఇస్తున్నా.. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు.. అవన్నీ రూమర్లే అని ఖండించింది వర్షిణి. దీంతో ఆమెకు ఆదికి మధ్య ఏం లేదని అందరికీ క్లియర్‌గా అర్థమైంది. తాజాగా వర్షిణి మరోసారి ప్రేమ వార్తలతో తెరపైకి వచ్చింది.

ఢీ కొరియోగ్రాఫర్ అభితో వర్షిణి కలిసి కనిపించింది. ఇక ఇద్దరూ రెస్టారెంట్లో కలిసి కనిపించారు. ఈ ఇద్దరూ సెల్ఫీకి పోజులు ఇచ్చారు. అంతే కాకుండా అభి ఈ ఫోటోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తే.. వర్షిణి సైతం రిప్లై ఇచ్చింది. తన స్టోరీలోనూ ఆ ఫోటోలను షేర్ చేసింది. అభి షేర్ చేస్తూ కింద లవ్ సింబల్‌ను కూడా పెట్టేశాడు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్ పుట్టుకొచ్చింది. మరి దీనిపై వర్షిణి రియాక్ట్ అవుతుందా?లేదా? అన్నది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *