టీవీ వేస్తే చాలు గలగలమంటూ ఆమె మాట్లాడుతూ ఏదో ఒక ఛానెల్‌లో కనిపిస్తుంది. ఆమెను చూస్తే చాలా ఆరోగ్యంగా, చురుగ్గా, ఉత్సాహంగా కనిపిస్తుంది. ఏ ఆరోగ్య సమస్యా ఉన్నట్టే అనిపించదు. కానీ సుమ కూడా దీర్ఘకాలంగా ఓ వింత వ్యాధితో ఇబ్బంది పడుతోంది. గత పదిహేనేళ్లుగా తెలుగు బుల్లితెరను ఏలుతున్న ఈ మాటల మహారాణి ఓసారి తనను వేధిస్తున్న వింత సమస్య గురించి పంచుకుంది. అయితే యాంకర్ సుమ కనకాల తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
చలాకైన మాటలతో అలరించే సుమ ఓ వింత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. టీవీ మెగాస్టార్‌గా పిలవబడుతోన్న సుమ గత కొన్ని సంవత్సరాలుగా ఒక అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. తను యూట్యూబ్ ఛానల్‌లో ఆ వ్యాధి గురించి మాట్లాడుతూ.. తను కీలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ ఇన్ఫెక్షన్‌తో బాధ పడుతున్నట్లు సుమ తెలిపారు. ఈ చర్మ వ్యాధి కారణంగా కొన్ని సంవత్సరాలు ఎన్నో భాదలు, కష్టాలు పడినట్లు చెప్పారు. ఈ వ్యాధి వల్ల మేకప్ వేసుకున్న ప్రతిసారి ఇబ్బందులు పడాల్సి వస్తుందని బాధపడ్డారు.
తన కెరీర్ మొదలుపెట్టిన కొత్తలో ముఖానికి మేకప్ ఎలా వేసుకోవాలి, ఎలా తీసేయాలి వంటి విషయాలు సరిగ్గా తెలియక తన చర్మానికి ఈ డ్యామేజ్ జరిగిపోయిందని, తర్వాత అది తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసినా.. ఫలితం రాలేదని తెలిపారు. కీలాయిడ్ టెండెన్సీ అంటే చర్మంపై ఒక చోట గాయం అయితే ఆ గాయం రోజు రోజుకు పెద్దదిగా మారి చుట్టుపక్కల అంతా వ్యాపించి మరింత పెద్ద గాయం అయ్యే అవకాశం ఉంటుందట.