యాంకర్ సుమ కొడుకు అరెస్ట్..!ఫ్రెండ్స్ తో కలిసి కార్ లో వెళ్తుండగా..?

రోషన్ కారులో భారీ ఎత్తున సూట్ కేసులు ఉండటంతో పోలీసులు వాటిని తెరిచి చూపించాలని కోరారు. సూట్ కేసులను ఓపెన్ చేయడానికి రోషన్ మొదట ఒప్పుకోలేదు. ఇండస్ట్రీ‌లో తనుకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించే ప్రయత్నం చేశారు. అయితే ‘బబుల్ మగమ్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పోలీస్ రైడింగ్ లో దొరికినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు సుమా కొడుకు రోషన్. అందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతుంది.

ప్రారంభంలో ఈ వీడియో చూసిన నెటిజన్స్ అంతా ఇది నిజమేనేమో అనుకున్నారు. కానీ వీడియో పూర్తిగా చూసిన తర్వాత వాళ్లకి క్లారిటీ వచ్చింది ఇదొక పబ్లిసిటీ స్టంట్ అని. ఈమధ్య హీరోలు తన సినిమాలు ప్రమోట్ చేసుకోవడం కోసం ఇలాంటి స్టంట్స్ ఎన్నో చేస్తున్నారు. ఆ మధ్య అల్లరి నరేష్ ‘ఉగ్రం’ సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా యాంకర్ సుమను అరెస్టు చేసినట్లు అందరిని నమ్మించాడు. సుమా అరెస్ట్ వీడియో కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది.

కానీ చివరికి అది ఉత్తుత్తి అరెస్ట్ అని, ప్రమోషన్ కోసం చేసిందని తెలిసిపోయింది. ఇక సుమా కొడుకు రోషన్ కూడా అలాంటి ఓ ప్రాంక్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ‘బబుల్ గమ్’ మూవీ విషయానికి వస్తే.. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. రవికాంత్ పేరేపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఇందులో రోషన్ సరసన మానస చౌదరి హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి విడుదల టీజర్, సాంగ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *